అలసిపోయి ఆసుపత్రిలో చేరిన ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్

Published on Jan 19, 2021 8:07 pm IST


బాలీవుడ్ పరిశ్రమలో టాప్ కథానాయకిగా దూసుకుపోతోంది ఆలియా భట్. స్టార్ హీరోల సినిమాలే కాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలను కూడ చేస్తోంది ఆమె. గత ఏడాది ఆమె ఒకేసారి మూడు నాలుగు సినిమాలకు సైన్ చేశారు. కానీ లాక్ డౌన్ రావడంతో ఆ సినిమాలన్నీ ప్రారంభ దశలోనే ఆగిపోయాయి. మళ్ళీ లాక్ డౌన్ అనంతరం అన్నీ వెంటవెంటనే మొదలయ్యాయి. దీంతో ఆలియా భట్ ఫుల్ బిజీ అయిపోయింది.

టైట్ షెడ్యూల్ నడుమ సినిమాలు చేస్తున్నారు ఆమె. లాక్ డౌన్ అనంతరం ‘బ్రహ్మాస్త్ర’ సినిమాను స్టార్ట్ చేసి పూర్తిచేసిన ఆమె ఆతర్వాత వెంటనే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ‘గంగూభాయ్’ సినిమాను మొదలుపెట్టింది. ఆ సినిమా షూటింగ్ ఒక కొలిక్కి రావడంతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణలో పాల్గొంది. ఆ వెంటనే మళ్ళీ ‘గంగూభాయ్’ షూటింగ్ మొదలైంది. ఇలా ఎడతెరిపి లేకుండా రాత్రి పగలు షూటింగ్లు చేయడంతో నిద్రలేమి వలన ఆమె ఆరోగ్యం డిస్టర్బ్ అయిందట. దీంతో ఆమె ఆదివారం ఆసుపత్రిలో జాయిన్ కావాల్సి వచ్చింది. ఒక రోజంతా చికిత్స తీసుకున్న ఆమె కోలుకున్న వెంటనే ‘గంగూభాయ్’ సెట్లోకి అడుగుపెట్టారట. అది పూర్తవగానే వచ్చే నెలలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణలో జాయిన్ కానుంది ఆలియా.

సంబంధిత సమాచారం :