చరణ్ హీరోయిన్ జాయిన్ అవుతుందట..!

Published on Apr 4, 2020 9:00 pm IST

ఆర్ ఆర్ ఆర్ నుండి హీరోయిన్ అలియా భట్ తప్పుకున్నారని ఈ మధ్య కొన్ని పుకార్లు నడిచాయి.హిందీలో అనేక చిత్రాలలో నటిస్తున్న అలియా డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆర్ ఆర్ ఆర్ నుండి తప్పుకున్నారంటూ వార్తలు వచ్చాయి. ఐతే అందులో ఎటువంటి నిజం లేదని తెలిసిపోయింది. ఈ పుకార్ల తరువాత కూడా ఆమె ఆర్ ఆర్ ఆర్ అప్డేట్స్ ని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పంచుకున్నారు. ఈ భామ నెక్స్ట్ షెడ్యూల్ నందు ఆర్ ఆర్ ఆర్ టీం తో జాయిన్ కానున్నారు.

కరోనా లాక్ డౌన్ కారణంగా ఆర్ ఆర్ ఆర్ షెడ్యూల్ మే కి షిప్ట్ అయ్యింది. మే నుండి పుణె లో ఈ మూవీ షెడ్యూల్ మొదలుకానుండగా, అలియా జాయిన్ అవుతారు. ఇక చరణ్ తో ఆమె సన్నివేశాల చిత్రీకరణతో పాటు సాంగ్స్ షూటింగ్ కూడా జరగనుంది. అలియా సీత అనే పాత్ర చేస్తుండగా ఆమె రామరాజు ప్రియురాలిగా కనిపించనుంది. ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తుండగా ఆయనకి జంటగా బ్రిటిష్ భామ ఒలీవియా మోరిస్ నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More