అలియా భట్ తో రాజమౌళికి కొత్త సమస్య…?

Published on Jun 22, 2019 12:00 am IST

ప్రతిష్టాత్మక ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీకి మరో సమస్య వచ్చిపడిందని సమాచారం. చరణ్ కి జోడిగా నటిస్తున్న అలియా భట్ త్వరలో మొదలుకానున్న అహ్మదాబాద్ షెడ్యూలులో పాల్గొనడం కష్టమే అని తెలుస్తుంది. దీనికి కారణం ఆమె అనారోగ్యం పాలు కావడమే. ఆర్ ఆర్ ఆర్ తో పాటు అలియా రణ్వీర్ కపూర్ కి జంటగా “బ్రహ్మాస్త్ర” అనే భారీ బడ్జెట్ మూవీలో కూడా నటిస్తుంది. ఇదివరకే ప్రేగు ఇన్ఫెక్షన్ కి చికిత్స తీసుకున్న అలియా,రెగ్యులర్ గా షూటింగ్ లో పాల్గొనడం వలన ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువకావడంతో చికిత్స కొరకు అమెరికా వెళ్లారట. కాబట్టి బ్రహ్మాస్త్ర తో పాటు ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ లో కూడా అలియా ప్రస్తుతం పాల్గొనే పరిస్థితి లేదంట.

ఇప్పటికే ఎన్టీఆర్,చరణ్ లకు తగిలిన గాయాల వలన అనుకున్న సమయంకంటే రెండు నెలలు షూటింగ్ ఆలస్యం కావడంతో,మళ్ళీ అలియా అనారోగ్యం వలన ఇంకెంత ఆలస్యమౌతుందోనని రాజమౌళి కంగారుపడుతున్నారట.రాజమౌళి 2020జులై 30న ఆర్ ఆర్ ఆర్ ని విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More