కంటనీరు పెట్టిన ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్.. !

Published on Dec 3, 2019 7:16 am IST

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ కూతురిగా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన అలియా భట్ అనతి కాలంలోనే హీరోయిన్ గా ఎదిగింది. స్టార్ట్ హీరోయిన్ హోదా అనుభవిస్తున్న ఆమె ప్రతిష్టాత్మక చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తుంది. హిందీలో భారీ బడ్జెట్ మూవీ బ్రహ్మస్త్ర లో నటిస్తున్న ఆమె తెలుగులో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీలో అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్న చరణ్ కి హీరోయిన్ గా ఆమె నటిస్తున్నారు.

కాగా అలియా ఒక కార్యక్రమంలో తన చెల్లెలు షహీన్ గురించి తలచుకొని కన్నీటి పర్యంతరమయ్యారు. అలియా చెల్లులు 13ఏళ్ల వయసు నుండి చాలా కాలం డిప్రెషన్ లోకి వెళ్లారట. ఆ విషయం అలియాకు చెల్లి షహీన్ రాసిన ‘ఐ హావ్ బీన్ నెవర్ అన్ హ్యాపీయర్’ అనే బుక్ చదివే వరకు తెలియదని ఆమె చెవుతూ వేదిక పైనే కంటనీరు పెట్టారు. తన చెల్లి పరిస్థితి గురించి తెలుసుకోనందుకు ఆమె చాలా బాధ పడ్డారు. ఇక అలియా ఆర్ ఆర్ ఆర్ లో తన పార్ట్ పూర్తి చేసిందని సమాచారం.

సంబంధిత సమాచారం :

X
More