యంగ్ టైగర్ రాక కోసమే అంతా వెయిటింగ్.!

Published on Mar 13, 2021 9:00 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ భారీ చిత్రంతో పాటుగా మళ్ళీ తెలుగు స్మాల్ స్క్రీన్ పైకి తన బ్లాస్ట్ చూపించడానికి వస్తున్నాడు.

అప్పుడు బిగ్ బాస్ షోలో హోస్ట్ గా అదరగొట్టిన యంగ్ టైగర్ ఇప్పుడు జెమిని టీవిలో “ఎవరు మీలో కోటీశ్వరులు” అనే మరో రియాలిటీ షోతో రానున్నారు. మరి ఈ సందర్భంగా అధికారికంగా ఒక ప్రెస్ మీట్ కు ఈరోజు హాజరు కానున్నాడని తెలిసిందే. దీనితో సోషల్ మీడియాలో తారక్ ఫ్యాన్స్ నడుమ ఆ హంగామా మొదలయ్యిపోయింది.

తారక్ నయా లుక్ కోసమే కాకుండా ఎలాంటి అంశాలు మాట్లాడుతాడా అని యంగ్ టైగర్ ఫ్యాన్స్ గట్టిగా ఎదురు చూస్తున్నారు. అందుకే ఇప్పుడు తారక్ పేరు కూడా ట్రెండ్ అయ్యిపోతుంది. మరి తారక్ దర్శనం కావాలి అంటే ఈ రోజు ఉదయం 11 గంటల వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :