వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు పంజాబీ అమ్మాయి తాప్సి. మొదట్లో తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించిన సరైన బ్రేక్ రాకపోవడంతో బాలీవుడ్ లోకి వెళ్ళింది. భిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస అవకాశాలతో అక్కడ బిజీ అయ్యారు.
ఆమె తాజగా హిందీ భాషలో నటించిన చిత్రం ‘ముల్క్’. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం మంచి రివ్యూస్ ను సొంతం చేసుకుంది. నిజ జీవిత కథ తో తెరకెక్కిన ఈచిత్రంలో తాప్సి లాయర్ పాత్రలో నటించింది. ఇక ఈ చిత్రంలోఆమె నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. అనుభవ్ సింహ తెరకెక్కించిన ఈ చిత్రంలో రిషి కపూర్ ప్రధాన పాత్రలో నటించారు.


