సీనియర్ నటుడు కుమారుడి ఎంట్రీకి రంగం సిద్ధం !

సీనియర్ నటుడు కుమారుడి ఎంట్రీకి రంగం సిద్ధం !

Published on Aug 13, 2018 5:00 PM IST


విలక్షణ నటుడుతో పాటుగా బహుభాషా నటుడుగా ఎంతో పేరుప్రఖ్యాతలు తెచ్చుకున్న సీనియర్ నటుడు నాజర్‌. పైగా ఆయన జాతీయ అవార్డు గ్రహీత కూడా. ఇప్పటికే నాజర్ చాలా చిత్రాల్లో నటించారు. ఆయన పెద్ద కుమారుడు కూడా సినిమాల్లోనే ఉన్నారు.

కాగా, తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు నాజర్ చిన్న కుమారుడు అబీ మెహిదీ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తన మొదటి సినిమాని తమిళంలో చేస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్ స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతుంది. తాజాగా కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ చిత్రం స్క్రిప్ట్ పూర్తయిందని తెలుస్తోంది. నవంబర్ లో ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుందట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు