చరణ్ పై ఈ బిగ్ అప్డేట్ కోసం అంతా వెయిటింగ్.!

Published on Mar 25, 2021 10:00 am IST

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు భారీ మల్టీ స్టారర్ చిత్రాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి వాటిలో తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ప్లాన్ చేసిన భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య” కూడా ఒకటి. ఇందులో చరణ్ ‘సిద్ధ’ అనే పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు.

ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే చిన్న చిన్న ఫొటోస్ తో టీజ్ చేసిన మేకర్స్ నుంచి టైం గడుస్తున్నా సరైన అప్డేట్ ఇంకా రావట్లేదు ఏంటా అని మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే మార్చ్ 27న చరణ్ బర్త్ డే సందర్భంగా కనీసం పోస్టర్ కోసం అయినా ఆశిస్తున్నారు.

మరి మేకర్స్ ఈ అప్డేట్ ను చేస్తారా లేదా అన్నది చూడాలి. ఇక ఈ భారీ చిత్రంలో చిరు సరసన కాజల్ హీరోయిన్ గా నటించగా చరణ్ సరసన పూజా హెగ్డే నటించింది. అలాగే ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :