గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా ఇప్పుడు తన కెరీర్ 111వ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు గోపిచంద్ మలినేనితో చేస్తున్న ఈ రెండో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాలయ్య పుట్టినరోజు నేడు జూన్ 10కి వచ్చేసింది. దీనితో మేకర్స్ ఈ సినిమా తాలూకా గ్లింప్స్ సహా టైటిల్ ను రివీల్ చేస్తున్నట్లు బిగ్ అప్డేట్ అందించారు.
దీనితో ఈ సాయంత్రం కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలయ్య అఖండ తర్వాత నుంచి తన లైనప్ తో ఒక్క ఫ్యాన్స్ లోనే కాకుండా జెనరల్ ఆడియెన్స్ లో కూడా తన సినిమాల మార్కెట్ పెంచుకున్నారు. పైగా థమన్, గోపిచంద్ కాంబినేషన్ అంటే కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇలా ఫైనల్ గా బాలయ్య కొత్త ట్రీట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక నేడు వచ్చే ట్రీట్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.


