“లవ్ స్టోరీ” ఈ ట్రీట్ కోసం అంతా వెయిటింగ్.!

Published on Apr 4, 2021 9:29 pm IST

ఇప్పుడు రానున్న పలు ఆసక్తికర చిత్రాల్లో అక్కినేని యువ హీరో నాగ చైతన్య హీరోగా టాలెంటెడ్ అండ్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “లవ్ స్టోరీ” కూడా ఒకటి. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రంపై సాలిడ్ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మ్యూజిక్ పరంగా భారీ హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం ఈ వచ్చే ఏప్రిల్ 16న విడుదలకు రెడీగా ఉంది.

అయితే ఇప్పుడు ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసేయనున్నారు. సరే ఇదంతా బాగానే ఉన్నా ఈ సినిమా ట్రైలర్ కోసమే ఇప్పుడు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి మేకర్స్ ఈ బ్యూటిఫుల్ ట్రైలర్ కట్ ను ఏ డేట్ కు లాంచ్ చేస్తారో అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఈ చిత్ర నిర్మాతలు చైతు మరియు పల్లవిల పెర్ఫామెన్స్ అవుట్ స్టాండింగ్ గా వచ్చింది అని తెలిపారు. మరి ఈ ట్రైలర్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :