“దసరా” ఓపెనింగ్స్ పై అందరిలో ఆసక్తి.!

“దసరా” ఓపెనింగ్స్ పై అందరిలో ఆసక్తి.!

Published on Mar 30, 2023 6:11 PM IST

చాలా కాలం తర్వాత అయితే టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్లో ఓ సినిమా భారీ హైప్ తో రిలీజ్ అయ్యింది. విడుదల అవుతున్న అన్ని భాషల్లో కూడా అగ్రెసివ్ ప్రమోషన్స్ నడుమ ఈరోజు రిలీజ్ అయ్యిన ఆ సినిమానే “దసరా”. నాచురల్ స్టార్ నాని కాస్తా ‘నాటు’రల్ స్టార్ గా మారిపోయి చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.

అయితే ఈ సినిమా హైప్ తో అయితే పాన్ ఇండియా లెవెల్లో అసలు ఎలాంటి వసూళ్లు మొదటి రోజు ఈ సినిమా రాబడుతుంది అని అనేది ఆసక్తిగా మారింది. అటు ఆల్రెడీ యూఎస్ లో ప్రీమియర్ వసూళ్లు పై క్లారిటీ ఉంది. దీంతో వరల్డ్ వైడ్ గా దసరా డే 1 వసూళ్లు అనేది ఇండస్ట్రీ వర్గాల్లో చర్చగా మారిన అంశం. చాలా మంది అయితే నాని కెరీర్ లోనే కాకుండా టైర్ 2 హీరోస్ లో కూడా ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్ ఈ సినిమాకి దక్కొచ్చని భావిస్తున్నారు. మరి ఆ రేంజ్ లో ఉంటాయా లేదా అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు