విక్రమ్ ట్రైలర్ పై అందరిలో ఆసక్తి.!

విక్రమ్ ట్రైలర్ పై అందరిలో ఆసక్తి.!

Published on Jul 10, 2024 10:02 AM IST

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో చియాన్ విక్రమ్ హీరోగా మాళవిక మోహనన్ హీరోయిన్ గా దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించిన అవైటెడ్ భారీ చిత్రం “తంగలాన్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ భారీ చిత్రం కోసం ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కి అప్పట్లో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.

అసలు చాలా కాలం తర్వాత విక్రమ్ నుంచి తన పొటెన్షియల్ కి తగ్గట్టుగా డిజైన్ చేసిన ఈ సినిమా టీజర్ కట్ స్యూర్ షాట్ హిట్ వైబ్స్ ని తీసుకొచ్చింది. దీనితో ఈ సినిమా కోసం తమిళ్ తో పాటు తెలుగు ఆడియెన్స్ కూడా ఓ రేంజ్ లో ఎగ్జైట్ అయ్యారు. కానీ ఈ సినిమా అలా లేట్ అవుతూ వస్తూనే ఉంది.

మరి ఫైనల్ గా ఇప్పుడు రిలీజ్ కి వస్తుండగా నేడు సాయంత్రం 5 గంటలకి అయితే సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మరి ఈ ట్రైలర్ పట్ల అందరిలో ఆసక్తి నెలకొంది. టీజర్ తరహాలోనే అదిరే లెవెల్లో ఉంటే మాత్రం ఈ చిత్రానికి మళ్ళీ కావాల్సినంత హైప్ వచ్చేస్తుంది అని చెప్పాలి. మరి పా రంజిత్ ఎలా ప్లాన్ చేసాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు