AA23 : బన్నీ కోసం లోకేష్ ఎవరిని దించుతాడో..?

AA23 : బన్నీ కోసం లోకేష్ ఎవరిని దించుతాడో..?

Published on Jun 9, 2026 5:00 PM IST

AA23

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందనే పుకార్లకు చెక్ పెడుతూ, దసరా తర్వాత జెట్ స్పీడ్‌తో షూటింగ్ ప్రారంభించేందుకు టీమ్ రెడీ అవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా, ఈ సినిమాలో బన్నీని ఢీకొట్టే ఆ పవర్ ఫుల్ విలన్ ఎవరనే దానిపైనే ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రధానంగా చర్చ నడుస్తోంది.

సాధారణంగా లోకేష్ కనగరాజ్ సినిమాల్లో విలన్ పాత్రలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. గతంలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సంజయ్ దత్, మరియు ‘రోలెక్స్’ పాత్రలో సూర్య వంటి స్టార్లను పవర్ ఫుల్ నెగిటివ్ రోల్స్‌లో చూపించి ఆయన మెప్పించారు. హీరోకి సమానంగా కథను నడిపించేలా ఈ పాత్రలను డిజైన్ చేయడం లోకేష్ స్టైల్. అందుకే ఈ కొత్త సినిమాలో కూడా విలన్ క్యారెక్టర్‌ను అత్యంత కీలకంగా ప్లాన్ చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్.

అయితే, కేవలం పెద్ద స్టార్లను విలన్లుగా పెట్టేస్తే సినిమా హిట్ అవ్వదని లోకేష్ లాస్ట్ చిత్రం ‘కూలీ’ నిరూపించింది. రజినీకాంత్‌తో పాటు అమీర్ ఖాన్, నాగార్జున వంటి బడా స్టార్స్ ఉన్నా, స్క్రిప్ట్‌లో దమ్ము లేకపోవడంతో ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. కాబట్టి, ఈసారి అల్లు అర్జున్ సినిమా కోసం లోకేష్ కేవలం స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ల వెనుక పడకుండా, కథకు పక్కాగా సెట్ అయ్యే నటుడిని ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు