శేష్ మోస్ట్ అవైటెడ్ “మేజర్” టీజర్ కు టైం లాక్.!

Published on Apr 10, 2021 11:00 am IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తనదైన సినిమాలతో మంచి బెంచ్ మార్క్ ను తెలుగు ఆడియెన్స్ లో సెట్ చేసుకున్నాడు. మరి అలా తాను ఇప్పుడు చేస్తున్న పలు ఆసక్తికర చిత్రాల్లో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం “మేజర్” కూడా ఒకటి. పాన్ ఇండియన్ లెవెల్లో శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం టీజర్ ఆ మధ్య డిలే అవుతూ వస్తుంది..

కానీ ఇప్పుడు మేకర్స్ ఎట్టకేలకు ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా టీజర్ రిలీజ్ డేట్ మరియు టైం ను అనౌన్స్ చేసేశారు. వచ్చే ఏప్రిల్ 12 న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ చెయ్యనున్నట్టుగా తెలిపారు. మరి ఈ టీజర్ మాత్రం మాసివ్ గా ఉంటుందని శేష్ ప్రామిస్ చేస్తున్నాడు. మరి ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ సహా సూపర్ స్టార్ మహేష్ బాబులు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :