అడివి శేష్ నెక్స్ట్ అనౌన్స్మెంట్ కు సర్వం సిద్ధం.!

Adivi Sesh
తనదైన సినిమాలతో మన తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ హీరో అడివి శేష్.. టాలీవుడ్ లో హాలీవుడ్ లెవెల్ సినిమాలను తక్కువ బడ్జెట్ తో చూపించే ఈ హీరో ఇప్పుడు “మేజర్” మరియు తన బిగ్గెస్ట్ హిట్ “గూఢచారి” సినిమాకు సీక్వెల్ గూఢచారి 2 లు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాగే ఇప్పుడు మేజర్ సినిమా ఆల్రెడీ రిలీజ్ డేట్ ను తెచ్చేసుకుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ హీరో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఓ అప్డేట్ ను రివీల్ చేసాడు. తన నెక్స్ట్ సినిమా అనౌన్స్మెంట్ రేపే ఉందని దర్శకుడు మరియు అతని టీం సూపర్ అని కానీ ప్రొడ్యూసర్ మాత్రం నా ఫేవరెట్ అని కాస్త ఆసక్తి రేపాడు. మరి అంత ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నా ఈ టీంలో ఎవరెవరు ఉంటారో తెలియాలి అంటే రేపటి అనౌన్సమెంట్ వరకు ఆగాల్సిందే. ఈ వచ్చే మార్చ్ 28న మేజర్ టీజర్ విడుదలకు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.

Exit mobile version