బాలయ్య అడుగు పడేందుకు రంగం సిద్ధం?

Published on Oct 28, 2020 12:05 am IST


ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తన విజయ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుతో మరో పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం కొంత మేర షూటింగ్ అయ్యిన సమయంలోనే లాక్ డౌన్ వచ్చేసింది. దీనితో ఈ చిత్రం తాలూకా షూటింగ్ కూడా పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇక ఈలోపలే బాలయ్యతో సినిమా చేసేందుకు పలువురు సీనియర్ అండ్ టాప్ మోస్ట్ దర్శకులు కథలు చెప్పడం బాలయ్య కొన్ని ఓకే చేసి కొన్ని హోల్డ్ లో పెట్టడం కూడా జరిగింది. కానీ బోయపాటితో సినిమా షూట్ ఎప్పుడు మొదలు కానుంది అన్నది మాత్రం క్లారిటీ రాలేదు కానీ ఇప్పుడు వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం బోయపాటి సెట్లో బాలయ్య అడుగు పడేందుకు రంగం సిద్ధం అయ్యినట్టు తెలుస్తుంది.

ఈ అక్టోబర్ 29నే హైదరాబాద్ షూటింగ్ లో బాలయ్య పాల్గొననున్నారని ఇప్పుడు టాక్. ఈ పక్కా మాస్ ఎంటర్టైనర్ కోసం మాత్రం నందమూరి అభిమానులు మరియు మాస్ ఆడియెన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఈ చిత్రం ఎప్పుడు విడుదల కానుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More