గత సంవత్సరం మోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ సాధించిన సినిమా ‘బెంగుళూరు డేస్’. మలయాళ స్టార్ హీరోస్ అయిన దల్క్వేర్ సల్మాన్, నివిన్ పాళీ, ఫహద్ మరియు నజరియా నటించిన ఈ సినిమాని అంజలి మీనన్ డైరెక్ట్ చేసింది. ఈ సినిమాని తెలుగు – తమిళ భాషల్లో రీమేక్ చెయ్యడానికి పివిపి – దిల్ రాజు కలిసి రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం చాలా మంది పేర్లు వినిపించినా కానీ నటీనటుల విషయంలో క్లారిటీ రాక ఈ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం నటీనటుల్ని ఫైనలిజ్ చేసారు. టాలీవుడ్ హీరో రానా, తమిళ నటులైన ఆర్య, బాబీ సింహా , శ్రీ దివ్యలను ఈ సినిమా కోసం ఎంపిక చేసారని సమాచారం. వీరిలో ఎవరెవరు ఏయే పాత్రలు చేయనున్నారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్న ఈ సినిమాని మార్చి 20న ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలోని మేజర్ పార్ట్ ని హైదరాబాద్, చెన్నై, సింగపూర్ లలో షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకి దర్శకుడు.


