ప్రభాస్ ఫ్యాన్స్ ఫీస్ట్ కు డేట్ కుదిరిందా?

ప్రభాస్ ఫ్యాన్స్ ఫీస్ట్ కు డేట్ కుదిరిందా?

Published on May 20, 2020 9:09 PM IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. స్వచ్ఛమైన ప్రేమ కథాగా మలుస్తున్న ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ డ్రామాగా రానుంది. అయితే ఈ చిత్రం విషయంలో మునుపటి లానే డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు.

చిత్రం మొదలయ్యి ఎన్నో నెలలు అయినా సరే ఇంకా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా చూసే భాగ్యం వారికి రాలేదని కాస్త దీనంగానే ఉన్నారు. అలాగే ఆ మధ్యలో ఫస్ట్ లుక్ పోస్టర్ ను అతి త్వరలోనే విడుదల చేస్తామని దర్శకుడు రాధా కృష్ణనే స్వయంగా తెలుపగా డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

కానీ వారి ఫీస్ట్ మూమెంట్ కు కరోనా బ్రేక్ వేసింది. దీనితో వారికి మరలా ఎదురు చూపులు తప్పలేదు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న బజ్ ప్రకారం ఈ రంజాన్ వేడుక రోజున ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసేందు అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. చిత్ర యూనిట్ కూడా ఆ దిశగానే సన్నాహాలు చేస్తున్నట్టు వినికిడి. ఇలా అన్ని సెట్టయితే ఈ రంజాన్ పర్వదినాన ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ ఖాయం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు