ఎప్పటిదో గోపీచంద్ సినిమాకు డీసెంట్ ఓటిటి ఆఫర్.?

Published on Sep 27, 2020 11:00 am IST

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో “సీటీ మార్” అనే ఒక స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గోపీచంద్ సెన్సేషనల్ డైరెక్టర్ బి గోపాల్ దర్శకత్వంలో ఎప్పుడో ఒక పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో నటించారు అదే “ఆరడుగుల బుల్లెట్”.

గత 2017 లోనే ఈ చిత్రం విడుదలకు వచ్చి చివరి నిమిషంలో ఆగిపోయింది. కానీ గత కొన్ని నెలల కితం ఈ చిత్రం ఓటిటీలో విడుదలకానుంది అని టాక్ వచ్చింది. ఇపుడు అందుకు సంబంధించి మరింత సమాచారం బయటకు వచ్చింది. ఈ చిత్రానికి ప్రముఖ ఓటిటి సంస్థ అయినటువంటి జీ 5 వారు డీసెంట్ ఆఫర్ ఇచ్చారని సినీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ చిత్రానికి వారు సినిమాకు అయిన బడ్జెట్ లో సగానికి దగ్గరగా ఆఫర్ చేశారట. దీనితో మేకర్స్ ఈ చిత్రాన్ని వారి ఇచ్చినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ చిత్రాన్ని దసరా కానుకగా స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్టు టాక్. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార నటించగా మణిశర్మ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :

More