తొలిప్రేమను తలపించే ‘నిను తలచి’ మూవీ…!

తొలిప్రేమను తలపించే ‘నిను తలచి’ మూవీ…!

Published on Sep 25, 2019 1:00 PM IST

నూతన హీరో వంశీ యాకసిరి, స్టెపీ పటేల్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు అనిల్ తోట తెరకెక్కిస్తున్న చిత్రం “నిన్ను తలచి”. నేదురుమల్లి ప్రొడక్షన్స్ బ్యానర్ పై నేదురుమల్లి అజిత్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఈనెల 27న విడుదల కానుంది. ఈ సందర్బంగా హీరో వంశీ మీడియా సమావేశంలో పాల్గొని చిత్ర విశేషాలు పంచుకున్నారు.

ఆయన మాట్లాడుతూ…,”నెల్లూరులో పుట్టిపెరిగిన నేను 2013 ఇండస్ట్రీకి రావడం జరిగింది. అప్పటినుండి దర్శకుడు అనిల్ తోటా గారితో పరిచయం ఉంది. గతంలో నేను కొన్ని సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ చేశాను. అనిల్ గారు నేను చేసిన ఈగిల్ అనే డెమో వీడియో ప్రొడ్యూసర్స్ ఓబులేష్ గారు మరియు అజిత్ కుమార్ గారికి నచ్చడంతో మా ఈ మూవీ కార్యరూపం దాల్చింది. పవన్ తొలిప్రేమ మూవీ స్పూర్తితో తెరకెక్కిన మా ఈ చిత్రం అభి మరియు అంకిత అనే ఓ జంట మధ్య నడిచే లవ్ డ్రామాగా తెరకెక్కించడం జరిగింది. సినిమాటిక్ గా కాకుండా మా మూవీ సహజంగా ఉంటుంది” అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు