‘బ్రహ్మోత్సవం’ షూటింగ్‌కి అంతా సిద్ధం!

‘బ్రహ్మోత్సవం’ షూటింగ్‌కి అంతా సిద్ధం!

Published on Jul 8, 2015 12:17 PM IST

Brahmotsavam1
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా ‘బ్రహ్మోత్సవం’. ప్రతిష్టాత్మక పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్ వి. పొట్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 31న ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకోగా, ఆ తర్వాత పకడ్బందీగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకొని మరో రెండు రోజుల్లో సెట్స్‌పైకి వెళ్ళనుంది.

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ‘బ్రహ్మోత్సవం’ జూలై 10నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఫస్ట్ షెడ్యూల్‌కు ఇంకా రెండు రోజులే ఉండగా ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసేసి సినిమా యూనిట్ షూట్‌కు సిద్ధమైంది. విజయవాడ నేపథ్యంలో తెరకెక్కే ఈ ఫ్యామిలీ డ్రామాలో మహేష్ ఫ్యామిలీలో సుమారుగా 50మందికి పైనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ 50 పాత్రలను తెలుగు సినిమాల్లో మంచి పేరున క్యారెక్టర్ ఆర్టిస్టులు చేయనున్నారట.

ఇక సినిమా షూటింగ్‌కు దగ్గరపడడంతో పీవీపీ సినిమా సంస్థ బ్రహ్మోత్సవం విషయంలో చాలా ఎగ్జైటింగ్‌గా ఉందట. సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల కానున్న ఈ సినిమాలో మహేష్ సరసన సమంత, కాజల్ అగర్వాల్, ప్రణిత ముగ్గురు హీరోయిన్లు నటించనుండడం విశేషం! ఇదిలా ఉంటే.. మహేష్ బాబు తాజా చిత్రం ‘శ్రీమంతుడు’ ఆగష్టు 7న భారీ ఎత్తున విడుదల కానున్న విషయం తెలిసిందే!

తాజా వార్తలు