ఆంథమ్‌ తో రాబోతున్న ‘భీష్మ’ !

Bheeshma 1

నితిన్ హీరోగా ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో రానున్న ‘భీష్మ’ చిత్రం నుండి ఆంథమ్‌ రానుంది. రేపు సాయంత్రం 4 గంటలకు 5 నిముషాలకు సింగిల్ ఆంథమ్‌ లిరికల్ సాంగ్ విడుదల కానుందని చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇక ఈ చిత్రం ఫిబ్రవరి 21న రిలీజ్ కానుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో కామెడీ చాల బాగా వస్తోందని తెలుస్తోంది. ముఖ్యంగా వెన్నల కిశోర్ అండ్ నితిన్ ట్రాక్ సినిమాలో హైలెట్ అవుతుందని సమాచారం. మొత్తానికి వెంకీ కుడుముల ‘ఛలో’ మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా ఫుల్ ఎంటెర్టైనింగా మలుస్తున్నాడు.

ఈ చిత్రంలో ఒక కీ రోల్ కోసం హెబ్బా పటేల్ ను తీసుకున్నారు. కాగా సినిమాలో హెబ్బా పటేల్ పాత్ర నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని టాక్. మరి హెబ్బాకి ఈ చిత్రంతోనైనా ఆమె ఆశించిన బ్రేక్ ఆమెకు దక్కుతుందేమో చూడాలి. కాగా నితిన్ కూడా భీష్మ పై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

Exit mobile version