ఎం.ఎల్.ఎ నుండి అన్ని పాటలు విడుదలకానున్నాయి !

నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నటిస్తోన్న సినిమా ‘ఎం.ఎల్.ఏ’. ఈ సినిమాలోని మొదటిపాట ఇటీవల విడుదలైంది. తాజా సమాచారం మేరకు చిత్రంలోని అన్ని పాటలను జ్యూక్ బాక్స్ ద్వారా ఈరోజు సాయంత్రం విడుదల చెయ్యబోతున్నారు. ఈ నెల 17 న కర్నూల్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా చెయ్యబోతున్నారు.

ఈరోజు సెన్సార్ జరుపుకోనున్న ఈ సినిమా కామెడి ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తరువాత కళ్యాణ్ రామ్ నటించిన ‘నా నువ్వే’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మే నుండి పవన్ సాదినేని సినిమా ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఆ సినిమాకు సంభందించి స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాను త్వరలో అనౌన్స్ చెయ్యబోతున్నారు.