మహర్షి లో నరేష్ రోల్ ఇదేనా ?

Published on Apr 15, 2019 4:16 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సమ్మర్ లో ‘మహర్షి’ చిత్రం తో ప్రేక్షకులముందుకు రానున్నాడు. మే 9న విడుదలకానున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది. ఇంకా ఒక సాంగ్ షూటింగ్ కూడా బ్యాలన్స్ వుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ సూపర్ రెస్పాన్స్ ను రాబట్టి సినిమా ఫై అంచనాలను రెట్టింపు చేశాయి.

ఇక ఈ చిత్రంలో ప్రముఖ హీరో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. ఈచిత్రంలో నరేష్ , మహేష్ కు స్నేహితుడు గా నటిస్తున్నాడు.వీరిద్దరూ కలిసి చదువుకున్న తరువాత మహేష్ అమెరికా వెళ్ళిపోతాడని నరేష్ మాత్రం రైతుల సమస్యలపై పోరాతాడని ఈ క్రమంలో మహేష్ , నరేష్ కు సహాయం చేయడానికి ఇండియా వస్తాడనే కథనాలు వెలుబడుతున్నాయి. ఈ చిత్రంలో నరేష్ అవార్డు విన్నింగ్ నటనతో ఆకట్టుకుంటాడట. మరి ఈ సినిమా నరేష్ కెరీర్ కు బూస్ట్ ఇస్తుందో లేదో చూడాలి.

వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు , అశ్వినీ దత్ , పీవీపీ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :