కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటించిన సినిమా ‘బ్రదర్ అఫ్ బొమ్మాలి’. ఈ సినిమాలో ఈ అల్లరోడికి బెండు తీసే బొమ్మాళి పాత్రలో కార్తీక కనిపించనుంది. రేపు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర టీం ఈ సినిమా విజయంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అల్లరి నరేష్ కూడా ఈ సారి బిగ్గెస్ట్ హిట్ అందుకోనున్నానని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
వారి కాన్ఫిడెంట్ కి మొదటి కారణం ఈ సినిమాలో కట్టే కొట్టే తెచ్చే అన్న స్టైల్ ఉండే కామెడీ సీన్స్, పంచ్ డైలాగ్స్, అలాగే కార్తీక చేసే ఫైట్లు, డాన్సులు వీటన్నిటితో పాటు ప్రేక్షకులు మెచ్చిన సీనియర్ నటులు ఈ సినిమాలో ఉన్నారు. వీటితో పాటు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఈ సినిమా చూసి, నచ్చి హిట్ అవుతుందని హ్యాపీగా కొనుక్కున్నారు. అన్నిటికీ మించి 2 గంటల 9 నిముషాలు మాత్రమే ఈ సినిమా నిడివి కావడం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని ఈ చిత్ర టీం బ్రదర్ అఫ్ బొమ్మాళి సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
అందుకే కూడా ఈ సినిమా భారీగా రిలీజ్ చేస్తున్నారు. ‘సుడిగాడు’ తర్వాత అల్లరి నరేష్ మరోసారి మోనాల్ గజ్జర్ తో రొమాన్స్ చేస్తున్న ఈ సినిమాకి చిన్నికృష్ణ డైరెక్టర్. అమ్మిరాజు నిర్మిస్తున్న ఈ మూవీకి శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్.


