హిలేరియస్ ఎంటర్టైనర్ అనౌన్స్ చేసిన ‘అల్లరి’ నరేష్.!

Published on Jun 30, 2021 11:00 am IST

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి అతి కొద్ది మంది కామెడీ స్టార్ హీరోస్ లో అల్లరి నరేష్ కూడా ఒకరు. అయితే ఒక్క కామెడీ హీరో అనే ముద్రను దాటి కూడా తన నటనతో నరేష్ తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే కామెడీ హీరోగా కూడా ఎక్కడా తన మార్క్ పోనివ్వకుండా ఇప్పుడు మరిన్ని ఇంట్రెస్టింగ్ సబ్జక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. మరి ఈ ఏడాది వచ్చిన “నాంది” లాంటి స్ట్రాంగ్ సబ్జెక్ట్ తో అదరగొట్టిన నరేష్.

ఈరోజు తన బర్త్ డే సందర్భంగా కొత్త సినిమాలు అనౌన్స్ చేశారు. మరి వాటిలో ఒక హిలేరియస్ ఎంటర్టైనెర్ ను కూడా ప్రకటించారు. దానికి “సభకు నమస్కారం” అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. నూతన దర్శకుడు సతీష్ మల్లపాటి దర్శకత్వం వహిస్తుండగా సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రం షూట్ అతి త్వరలోనే మొదలు కానుంది.

సంబంధిత సమాచారం :