
ఎవరికైనా కెరీర్లో సక్సెస్ వస్తే ఇంకా ఉత్సాహంతో పనిచేస్తారు. అలానే పలు ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్న యంగ్ హీరో అల్లరి నరేష్ ‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా అందించిన విజయంతో అల్లరి నరేష్ అప్పుడే తన తదుపరి సినిమాని ఫినిష్ చేసి రేపు ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నాడు. ఈ సినిమా విజయంపై కూడా అల్లరి నరేష్ డబుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. దానికి కారణం అల్లరి నరేష్ ఓ సరికొత్త కథతో మన ముందుకు రానుండడం. ఈ సినిమా స్క్రిప్ట్ పై నరేష్ అతని టీం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
అల్లరి నరేష్ ఈ సినిమాలో దొంగల్ని, లంచగొండిలను దోచుకునే దొంగగా కనిపిస్తాడు. అల్లరి నరేష్ కి జోడీగా ఈశ కనిపించనున్న ఈ సినిమాలో సంపూర్నేష్ బాబు, తనికెళ్ళ భరణి, ఆర్యన్ రాజేష్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నాడు. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పంచ్ డైలాగ్స్ వాళ్ళ కామెడీ కంటే సందర్భానుసారంగా వచ్చే కామెడీనే హైలైట్ అవుతుందని నరేష్ అంటున్నాడు. అల్లరి నరేష్ – ఆర్యన్ రాజేష్ కలిసి ఈవివి సినిమా బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకి కళ్యాణి కొడూరి సంగీతం అందించాడు. మరి ఈ బందిపోటు రేపు ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుంటాడు అనేది చూడాలి.

