‘బందిపోటు’లో నయా అల్లరి నరేష్..!

‘బందిపోటు’లో నయా అల్లరి నరేష్..!

Published on Jan 10, 2015 10:00 PM IST

bandipottu

యంగ్ హీరోలలో కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన నటుడు అల్లరి నరేష్. తెరపై వినోదం పండించడమే కాదు, అవసరమైతే ‘గమ్యం’లో గాలి శీనుగా ప్రేక్షకుల చేత తన నటనతో కంట తడి కూడా పెట్టించగలడు. ఎటువంటి పాత్రనైనా పోషించగల సమర్ధత ‘శంభో శివ శంభో’ లాంటి సినిమాలతో నిరూపించుకున్నాడు. కానీ, అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించారు. ప్రేక్షకుల మైండ్ సెట్ ను మెల్ల మెల్లగా మార్చడానికి అల్లరి నరేష్ ప్రయత్నాలు సాగిస్తున్నారు.

ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ‘బందిపోటు’ సినిమాతో వినూత్న ప్రయోగం చేస్తున్నారు అల్లరి నరేష్‌. ప్రేక్షకులు తన నుండి ఆశించే కామెడీని వదలి దూరంగా వెళ్ళకుండా.. నటనను ప్రదర్శించడానికి ఆస్కారం ఉన్న పాత్రలో పెర్ఫార్మెన్స్ ఇరగాదీశాడట. ‘బందిపోటు’లో కెరీర్‌ బెస్ట్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చాడని యూనిట్ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఈషా హీరోయిన్. జనవరి 11న ఈ సినిమా ఆడియోను విడుదల చేస్తున్నారు. కళ్యాణి కోడూరి సంగీత దర్శకుడు. ఇ.వి.వి. సినిమా పతాకంపై ఆర్యన్ రాజేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు