కామెడీ హీరో మూవీకి ‘జేమ్స్ బాండ్’ అనే టైటిల్.!

కామెడీ హీరో మూవీకి ‘జేమ్స్ బాండ్’ అనే టైటిల్.!

Published on Apr 26, 2015 1:30 PM IST

james-bond
టాలీవుడ్ లో సీనియర్ నరేష్, రాజేంద్ర ప్రసాద్ ల తర్వాత కింగ్ అఫ్ కామెడీ అనిపించుకున్న యంగ్ హీరో అల్లరి నరేష్. అల్లరి నరేష్ చేసే సినిమాలన్నీ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తాయని అందరికీ తెలిసిన విషయమే. ఈ ఏడాది ‘బందిపోటు’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లరి నరేష్ తన తదుపరి సినిమాని కూడా సిద్దం చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకి టైటిల్ ని కూడా ఖరారు చేసారు. ఈ టైటిల్ ఓ ఫేమస్ హాలీవుడ్ సినిమాకి చెందినది కావడం విశేషం.

అల్లరి నరేష్ తదుపరి సినిమాకి ‘జేమ్స్ బాండ్’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. అలాగే ఈ సినిమాకి ఉపశీర్షికగా ‘నేను కాదు నా పెళ్ళాం’ అని కూడా పెట్టారు. అల్లరి నరేష్ సరసన పోటుగాడు ఫేం సాక్షి చౌదరి హీరోయిన్ గా కనిపించనుంది. టైటిల్ ట్యాగ్ లైన్ ని బట్టి చూస్తుంటే బ్రదర్ అఫ్ బొమ్మాళిలో సిస్టర్ హీరోకి చుక్కలు చూపించినట్టు ఇందులో భార్య అల్లరోడికి చుక్కలు చూపించేలా ఉంది. ఈ జేమ్స్ బాండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. అల్లరి నరేష్ పోస్టర్స్ లో ఉండాల్సిన ఫన్ అందులో కూడా ఉండడంతో అది అందరినీ ఆకట్టుకుంటోంది. ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీను వైట్ల దగ్గర పనిచేసిన సాయి కిషోర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

తాజా వార్తలు