అభిమన్యుడు చాలా బాగుంది – నరేష్ !

హీరో విశాల్ నటించిన తమిళ చిత్రం ‘ఇరుంబు తేరై’ ఇటీవల విడుదలై మంచి రివ్యూస్ ని సొంతం చేసుకొని విశాల్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ ని సాధించి దిగ్విజయంగా ప్రదర్శింపబడుతుంది. తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో ఈ రోజు విడుదలైన ఈ సినిమా మంచి రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది.

సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కథ బాగుందని ఈ చిత్రంలో నటించిన అందరూ బాగా నటించారని ఈ సినిమా ని చూసిన హీరో అల్లరి నరేష్ తన అభిప్రాయాన్నితెలియజేసారు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ముఖ్య పాత్రలో నటించారు .

Exit mobile version