వైజాగ్ బీచ్ లో అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్ రొమాన్స్..!

వైజాగ్ బీచ్ లో అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్ రొమాన్స్..!

Published on Aug 11, 2014 2:52 PM IST

allari-naresh-monali

‘సుడిగాడు’ విజయం తర్వాత అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్ కలసి నటిస్తున్న తాజా సినిమా షూటింగ్ వైజాగ్ పరిసర ప్రాంతాలలో జరుగుతుంది. యారాడ బీచ్, రిషికొండ, గంగవరం తదితర ప్రాంతాలలో సాంగ్ షూటింగ్ జరుగుతుంది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ చేస్తున్నారు. బ్రదర్ & సిస్టర్ సెంటిమెంట్ నేపధ్యంలో కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో అల్లరి నరేష్, కార్తిక కవలలుగా నటిస్తున్నారు. ‘వీడు తేడా’ ఫేం చిన్నికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం వైజాగ్ లో చివరి పాటను చిత్రీకరిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఆగస్ట్ చివరి వారంలో ఆడియో విడుదల చేసి, సినిమాను సెప్టెంబర్‌ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అమ్మిరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భాస్కరభట్ల సాహిత్యం అందించారు. త్వరలో సినిమా టైటిల్ ప్రకటించనున్నారు.

తాజా వార్తలు