సీరియస్ కిల్లింగ్ లుక్స్ లో అల్లరి నరేష్ ఆసక్తి పెంచుతున్నాడు.

Published on Jan 18, 2020 2:03 pm IST

నూతన సంవత్సర ప్రారంభంలో అల్లరి నరేష్ తన కొత్త చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఎస్ వి టూ ఎంటర్టైన్మెంట్స్ అనే ఓ కొత్త ప్రొడక్షన్ కంపెనీ మొదటి చిత్రంగా అల్లరి నరేష్ హీరోగా ఓ మూవీ చేస్తున్నారు. దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు. ఈనెల 20వ తేదీన రామానాయుడు స్టూడియో నందు ఉదయం 9:44 నిమిషాలకు మూవీ ప్రారంభ కార్యక్రమం కలదు.

ఐతే ఈ అనౌన్స్మెంట్ పోస్టర్ లో అల్లరి నరేష్ లుక్ తన గత ఇమేజ్ కి భిన్నంగా చాల వైవిధ్యంగా ఉంది. ఎరుపెక్కిన కళ్ళు, ముఖం నిండా గాయాలతో ఉన్న నరేష్ సీరియస్ కంటెంట్ మూవీతో వస్తున్నాడు అనిపిస్తుంది. గతంలో నేను, విశాఖ ఎక్స్ ప్రెస్ వంటి చిత్రాలలో అల్లరి నరేష్ సీరియస్ కంటెంట్ ఉన్నసైకో పాత్రలు చేశారు. ఈ మధ్య ఆయన చేసిన కామెడీ చిత్రాలేవీ బాక్సాపీస్ వద్ద విజయం సాధించకపోవడంతో ఆయన పంథా మార్చినట్టున్నారు. ఇక గిరి దర్శకత్వంలో ఆయన చేస్తున్న బంగారు బుల్లోడు చిత్రీకరణ జరుపుకుంటుంది.

సంబంధిత సమాచారం :