ఓటీటీలోకి సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చిన ‘12A రైల్వే కాలనీ’.. ఏకంగా నాలుగు భాషల్లో..!

ఓటీటీలోకి సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చిన ‘12A రైల్వే కాలనీ’.. ఏకంగా నాలుగు భాషల్లో..!

Published on Dec 11, 2025 3:30 PM IST

12A-Railway-colony

టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ నటించిన రీసెంట్ మూవీ ‘12A రైల్వే కాలనీ’ ఇటీవల మంచి అంచనాల మధ్య రిలీజ్ అయింది. థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 21న బాక్సాఫీస్ దగ్గర మంచి బజ్‌తో రావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపారు. దర్శకుడు నాని కాసరగడ్డ తెరకెక్కించిన ఈ సినిమాకు రిలీజ్ తర్వాత ఊహించిన ఫలితం దక్కలేదు.

దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ చిత్రంగా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి సడెన్ ఎంట్రీ ఇచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. రిలీజ్ అయిన 20 రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రావడం విశేషం. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘12A రైల్వే కాలనీ’ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇక్కడ మరో విశేషమేమిటంటే ఈ సినిమా ఏకంగా నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండటం.

కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సాయి కుమార్, గెటప్ శ్రీను, జీవన్, హర్ష చెముడు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పొలిమేర ఫ్రాంచైజీ దర్శకుడు డా.అనిల్ విశ్వనాథ్ షో రన్నర్‌గా వ్యవహరించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమాను శ్రీనివాస్ చిట్టూరి ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు