అల్లరి నరేష్ పెళ్ళికి సిద్ధమాయెనే?

అల్లరి నరేష్ పెళ్ళికి సిద్ధమాయెనే?

Published on Apr 30, 2015 7:22 PM IST

Allari-Naresh
ప్రముఖ హాస్య కథా చిత్రాల హీరో అల్లరి నరేష్ పెళ్ళికి సిద్ధమయ్యారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తెలుగు సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్ తర్వాత హాస్యకథా చిత్రాల హీరోల్లో ఆ స్థాయి పేరు సంపాదించుకున్న హీరోగా అల్లరి నరేష్‌కి మంచి పేరుంది. ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తనయుడిగా సినీరంగ ప్రవేశం చేసి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అల్లరి నరేష్.

గత కొంత కాలం క్రితమే అల్లరి నరేష్ సోదరుడు ఆర్యన్ రాజేష్ పెళ్ళి జరిగింది. ఇక అప్పట్నుంచి ఆర్యన్ రాజేష్ తమ్ముడు అల్లరి నరేష్ పెళ్ళెప్పుడూ? అనే ప్రశ్న వినబడుతూ వస్తోంది. తాజాగా ఆ ప్రశ్నలన్నింటికి తెరదించినట్లు తెలుస్తోంది. మనకు అందుతున్న సమాచారం మేరకు విరూప అనే అమ్మాయితో అల్లరి నరేష్ పెళ్ళి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లాకు చెందిన విరూప కుటుంబం ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నట్లు సమాచారం. ముందుగా మే 3వ తేదీన నిశ్చితార్థం జరపడానికి ముహూర్తం ఫిక్స్ చేశారట.

కాగా పూర్తి ప్రైవేటు కార్యక్రమంగా ఈ వేడుక జరగనుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అఫీషియల్‌గా ఎవరూ ప్రకటన విడుదల చేయలేదు.
అల్లరి నరేష్ హీరోగా నటించిన తాజా సినిమా జేమ్స్‌బాండ్ ఈ నెల్లోనే విడుదలకు సిద్ధమౌతోంది. ఏ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సాయి కిషోర్ దర్శకుడు.

తాజా వార్తలు