‘కొట్టాల్సిన జాక్ పాట్ ఎదురుగా ఉన్నప్పుడు ఆలోచించాల్సింది జాబ్ గురించి కాదు’ అంటూ తన ప్రేయసికి ప్రేమ పాఠాలు వల్లిస్తున్నాడు అల్లరి నరేష్. ఆ జాక్ పాట్ ఏంటో తెలియాలంటే సినిమా విడుదల వరకు వెయిట్ చేయక తప్పదు. అల్లరి నరేష్ ఘరానా దొంగగా నటిస్తున్న సినిమా ‘బందిపోటు’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమీర్ పేటలో గల సారధి స్టూడియోస్ లో జరుగుతుంది. హీరో హీరోయిన్లపై రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన ఈష హీరోయిన్ గా నటిస్తుంది.
అల్లరి నరేష్ గత సినిమాలకు భిన్నంగా పూర్తి వినోదాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. 25 శాతం పూర్తయిందని సమాచారం. ఇ.వి.వి.సినిమా పతాకంపై అల్లరి నరేష్ సోదరుడు ఆర్యన్ రాజేష్ నిర్మిస్తున్నారు. కళ్యాణి కోడూరి సంగీత దర్శకుడు.


