మంచు మనోజ్ ‘పోటుగాడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ సాక్షి చౌదరి. కొంత కాలం గ్యాప్ తర్వాత ఈ అందాల భామ తెలుగులో మరో అవకాశం సొంతం చేసుకుంది. సాయి కిషోర్ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా నటించబోయే సినిమాలో హీరోయిన్ గా సాక్షి చౌదరి ఎంపికైంది.
రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాక్షి హుషారైన అమ్మాయి పాత్రను పోషిస్తుంది. కొన్ని రోజులు షూటింగ్ లో కూడా పాల్గొంది. అల్లరి నరేష్ ఎత్తుకు సరిపడా అందమైన అమ్మాయి కోసం వెతకగా, సాక్షి అయితే బాగుంటుందని ఫిల్మ్ మేకర్స్ భావించారు అని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.


