టాకీ భాగం చిత్రీకరణ ముగించుకున్న బందిపోటు

టాకీ భాగం చిత్రీకరణ ముగించుకున్న బందిపోటు

Published on Dec 5, 2014 10:10 AM IST

Bandipotu
గతంలో వరుస విజయాలతో కొనసాగిన అల్లరి నరేష్ ఈ మధ్య వరుసపెట్టి యావరేజ్ సినిమాలను మనముందుకు తీసుకోస్తున్నాడు. ఇక సాదాసీదా కధలకు స్వస్తి చెప్పి సున్నితమైన సినిమాలను తెరకెక్కించే ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ‘బందిపోటు’గా మనముందుకు రానున్నాడు. ఈ చిత్రం టాకీ భాగం చిత్రీకరణ ముగించుకుంది.

మొట్టమొదటి సారిగా మోహనకృష్ణ తన జోనర్ ని దాటి ఎంటర్టైనర్ ని తెరకెక్కించే పనిలో వున్నాడు. అదికూడా కామెడీ జోనర్ కావడం విశేషం. ఇటీవలే చిత్ర బృందం విదేశాలలో కొన్ని పాటల చిత్రీకరణ జరుపుకుంది. ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. ‘అంతకుముందు ఆ తరువాత’ సినిమాతో తెరారంగ్రేటం చేసిన ఈషా ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.ఈ.వి.వి సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు