బన్నీ కోసం అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడట !

బన్నీ కోసం అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడట !

Published on Jun 27, 2019 6:59 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా తమన్ ఈ సినిమా కోసం ఇప్పటికే ట్యూన్స్ అన్ని ఇచ్చేశాడట. బన్నీ డాన్స్ మూమెంట్స్ కి తగట్లు ట్యూన్స్ అద్భుతంగా వచ్చాయని.. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా టైటిల్ సాంగ్ ఉండబోతుందని తెలుస్తోంది.

ఇక ఆ మధ్య తమన్ ఇచ్చిన మొదటి ట్యూన్ లో సౌండింగ్ కూడా చాలా కొత్తగా ఉందని.. త్రివిక్రమే ఓ సందర్భంలో అన్నారు. మొత్తానికి ఈ సినిమా ఆల్బమ్ తమన్ కెరీర్ లోనే మరో సూపర్ హిట్ ఆల్బమ్ గా నిలిచిపోవటం ఖాయంలా కనిపిస్తోంది. ఇక ఈ సినిమలో బన్నీసరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే త్రివిక్రమ్ తో ‘అరవింద సమేత’కి, అలాగే బన్నీతో డీజే సినిమాకి పనిచేసింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి తల్లిగా ఒకప్పటి హీరోయిన్ టబు నటిస్తోంది. ఈ సినిమాను అల్లు అరవింద్ తో కలిసి చినబాబు నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు