శ్రీతేజ్‌ఆరోగ్య పరిస్థితి పై అల్లు అరవింద్ ఆరా !

Allu aravind

‘పుష్ప 2’ సినిమాని చూడటానికి వచ్చి, సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో దురదృష్టవశాత్తూ రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆమె కుమారుడు ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నాడు. ఐతే, తాజాగా శ్రీతేజ్‌ను నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు. ఏషియన్ ట్రాన్స్‌కేర్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న అతడి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్యం సహా పలు అంశాలపై డాక్టర్లను నిర్మాత అల్లు అరవింద్ ఆరా తీశారు.

అలాగే, అల్లు అరవింద్ శ్రీతేజ్‌కు ఇంకా మంచి చికిత్స అందించే విధంగా డాక్టర్స్ తో మాట్లాడినట్టు తెలుస్తోంది. అదేవిధంగా శ్రీతేజ్ పూర్తిగా రికవరీ కావడానికి ఎంత సమయం పడుతుందనేటువంటి విషయాలను కూడా అల్లు అరవింద్ డాక్టర్స్ ను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకుంటున్నాడని, ప్రస్తుతం అతను స్పీడ్ గా రికవరీ అవుతున్నాడని తెలుస్తోంది.

Exit mobile version