స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘రేసుగుర్రం’ చిత్రం నేటితో 100 రోజులు పూర్తి చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టించిన ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ సోలో హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించాడు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
‘రేసుగుర్రం’ తర్వాత అల్లు అర్జున్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రుద్రమదేవి’లో నటిస్తున్నాడు. సినిమాకి కీలకమైన గోన గన్నారెడ్డి పాత్రలో పోరాట యోధుడిగా కనిపించనున్నాడు. ఏకధాటిగా 40 రోజుల పాటు జరిగే ‘రుద్రమదేవి’ షూటింగ్ షెడ్యూల్లో పాల్గొంటున్నాడు. ఇటివల త్రివిక్రమ్ తో సినిమా ఆగిపోయింది అంటూ పుకార్లు వస్తున్న నేపధ్యంలో అల్లు అర్జున్ స్పందించారు. రాజమండ్రిలో జాయ్ అల్లుకాస్ షోరూం ప్రారంభోత్సవంలో త్రివిక్రమ్ సినిమా త్వరలో ప్రారంభం అవుతుందని చెప్పారు.
సమంత ఒక హీరోయిన్. మరో ఇద్దరు హీరోయిన్లకు ఈ సినిమాలో స్థానం ఉంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.


