క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నూతన దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో వచ్చిన ‘టాక్సీవాలా’ బాక్సాపీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబడుతూ చాలా ఏరియాల్లో ఇప్పటికే లాభాల బాట పట్టింది. అయితే ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరయిన విషయం తెలిసిందే. కాగా ఈ ఈవెంట్ సందర్భంగా అల్లు అర్జున్ చిత్రయూనిట్ లోని అందరి గురించి మాట్లాడారు. అయితే ఒక్క ఈ చిత్ర దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ గురించి మాత్రం బన్ని మాట్లాడటం మర్చిపోయారు.
కాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తనది పెద్ద మనుసు అని నిరూపించారు. తాను చేసిన ఈ చిన్న పొరపాటుకు దర్శకుడు క్షమాపణలు చెప్పారు. సినిమా సక్సెస్ పార్టీలో రాహుల్ కు ఈవెంట్లో నీ గురించి చెప్పడం మర్చిపోయినందుకు సారీ అని ఇది చిన్న పొరపాటు వల్ల జరిగిందని బన్నీ చెబుతుంటే.. రాహుల్ బన్నీ మంచి తనానికి చూసి ఆశ్చర్యపోయాడట.
