విజయ్ దేవరకొండ డైరెక్టర్ కి సారీ చెప్పిన అల్లు అర్జున్ !

Alluarjun3

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నూతన దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘టాక్సీవాలా’ బాక్సాపీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబడుతూ చాలా ఏరియాల్లో ఇప్పటికే లాభాల బాట పట్టింది. అయితే ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరయిన విషయం తెలిసిందే. కాగా ఈ ఈవెంట్ సందర్భంగా అల్లు అర్జున్‌ చిత్రయూనిట్ లోని అందరి గురించి మాట్లాడారు. అయితే ఒక్క ఈ చిత్ర దర్శకుడు రాహుల్‌ సంక్రిత్యాన్‌ గురించి మాత్రం బన్ని మాట్లాడటం మర్చిపోయారు.

కాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తనది పెద్ద మనుసు అని నిరూపించారు. తాను చేసిన ఈ చిన్న పొరపాటుకు దర్శకుడు క్షమాపణలు చెప్పారు. సినిమా సక్సెస్ పార్టీలో రాహుల్ కు ఈవెంట్లో నీ గురించి చెప్పడం మర్చిపోయినందుకు సారీ అని ఇది చిన్న పొరపాటు వల్ల జరిగిందని బన్నీ చెబుతుంటే.. రాహుల్ బన్నీ మంచి తనానికి చూసి ఆశ్చర్యపోయాడట.

Exit mobile version