ఔదార్యం చూపించిన అల్లు అర్జున్ !

ఔదార్యం చూపించిన అల్లు అర్జున్ !

Published on May 24, 2019 3:30 PM IST

స్టార్ హీరో అల్లు అర్జున్ తన వద్ద పనిచేసే ఉద్యోగులకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ఇప్పటికే పలుసార్లు చూశాం. తాజాగా కూడా ఆయన తన వద్ద పనిచేసిన ఐసిస్టెంట్ కొరియోగ్రఫర్ శిరీష్ వివాహానికి వెళ్లి ఆప్యాయంగా నవ దంపతుల్ని ఆశీర్వదించి మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.

శిరీష్ మొదట్లో గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థలో చిన్న ఉద్యోగంలో ఉండేవాడు. కానీ డ్యాన్స్ పట్ల అతని ఆసక్తిని, ప్రతిభని గుర్తించిన అల్లు అర్జున్ అతనికి ప్రత్యేకంగా డ్యాన్స్ శిక్షణ ఇప్పించి ప్రొఫెషనల్ కొరియోగ్ర‌ఫ‌ర్‌ని చేశారట. బన్నీ చేయూతతో శిరీష్ ప్రస్తుతం పరిశ్రమలోని పలువురి వద్ద అసిస్టెంట్ కొరియోగ్ర‌ఫ‌ర్‌గా పనిచేస్తున్నాడు. ఇకపోతే అల్లు అర్జున్ ప్రెజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు