బన్నీ కెరీర్లోనే హైయెస్ట్ గా “పుష్ప” కి.?

Published on May 31, 2021 9:00 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ వస్తుంది.ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంపై లేటెస్ట్ టాక్ ఒకటి వినిపిస్తుంది.

ఈ చిత్రం తాలూకా బిజినెస్ పరంగా చూస్తే ఓవర్సీస్ మార్కెట్ లోని డీల్ ఆల్రెడీ భారీ ధరకు పూర్తయిపోయిన్నట్టు తెలుస్తుంది. మరి ఇది కూడా బన్నీ గత చిత్రాల్లో దేనికి కూడా రాని ధరకు అమ్ముడుపోయిందట.

మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ భారీ చిత్రాన్ని సుకుమార్ రెండు భాగాలుగా తీస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :