‘ఐకాన్ స్టార్’ ట్యాగ్ సార్థకం కావాలంటే బన్నీ చాలానే చెయ్యాలి

Published on Apr 8, 2021 3:00 am IST

అల్లు అర్జున్ అంటేనే కొత్త తరహా స్టైల్స్ కు కేరాఫ్ అడ్రెస్. ప్రతి సినిమాలోనూ కొత్త స్టైల్ చూపించే బన్నీని అభిమానులంతా ప్రేమగా ‘స్టైలిష్ స్టార్’ అని పిలుచుకుంటుంటారు. కొన్ని సందర్భాల్లో అల్లు అర్జున్ అనే పేరు పలకకుండా స్టైలిష్ స్టార్ అనేస్తుంటారు. అంతలా బన్నీకి ఆ ట్యాగ్ అటుక్కుపోయింది. బన్నీకి తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది ఆ ట్యాగ్. బన్నీ వేసే కాస్ట్యూమ్స్, చేసుకునే హెయిర్ స్టైల్స్, మార్చే మేనరిజమ్స్ ఎప్పుడూ ప్రేక్షకులకు బోర్ కొట్టలేదు. బన్నీకి అంతలా ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడానికి కారణం కూడ ఆ స్టైలే.

కానీ ఇప్పుడు ఆ ట్యాగ్ మారింది. స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ అయ్యారు. ‘పుష్ప’ సినిమా నుండి విడుదలైన పుష్పరాజ్ ఇంట్రడక్షన్ టీజర్లో ఈ కొత్త విషయాన్ని రివీల్ చేశారు బన్నీ. టీజర్ చివర్లో స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్ కాస్త బద్దలైపోయి ఐకాన్ స్టార్ వచ్చి చేరింది. టీజర్లో హైలెట్ అయిన అంశాల్లో ఈ కొత్త ట్యాగ్ కూడ ఒకటి. అది చూసి అభిమానులు కూడ కొంత ఆశ్చర్యానికి గురయ్యారు. ఐకాన్ స్టార్ అనే పదం బాగానే ఉన్నా స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్ ఇకపై స్క్రీన్ మీద కనబడదు కదా అనుకుంటున్నారు.
ఈ కొత్త ట్యాగ్ కు అలవాటుపడటానికి వారికి కొంత టైమ్ తప్పకుండా పడుతుంది. బన్నీ సైతం కొత్తగా చేర్చుకున్న ఈ ట్యాగ్ ను సార్థకం చేసుకోవాలంటే ముందు ముందు మరింత కృషి చేసి ఐకాన్ మాదిరి నిలిచిపోయే మంచి పాత్రలు, సినిమాలు చేయాలి మరి.

సంబంధిత సమాచారం :