‘విజేత’ నాకు బాగా కనెక్ట్ అయింది – అల్లు అర్జున్

Published on Jul 15, 2018 8:34 pm IST


మెగాస్టార్ చిన్న అల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ కథానాయుకుడిగా నటించిన మొదటి చిత్రం ‘విజేత’ ఇప్పటికే విడుదలై విజయవంతంగా నడుస్తోంది. ఈ చిత్రం ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. కాగా ఆదివారం విజేత విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకకి ప్రత్యేక అతిధిగా అల్లు అర్జున్‌ వచ్చారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సినిమా గురించి మాట్లాడుతూ.. నేను ఇక్కడికి వచ్చే ముందే విజేత చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. నాకు నచ్చకపోతే ఆ సినిమా గురించి అస్సలు మాట్లాడలేను. ఫాదర్‌ సెంటిమెంట్‌ సీన్స్‌ నాకు చాలా బాగా కనెక్ట్‌ అయ్యాయి. మా ఫాదర్‌ అంటే ఇష్టముండటంతో ఆ సన్నివేశాలన్ని నాకు బాగా నచ్చాయి. పాటలు కూడా బాగున్నాయ్, కోడి పాట నాకు బాగా నచ్చింది.

ఇక మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుతూ హర్షవర్ధన్‌ మ్యూజిక్‌ నేను బాగా ఇష్టపడతాను. ఈ చిత్రంలో మురళీశర్మ గారు అద్భుతంగా నటించారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అయన నటన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. కళ్యాణ్‌ దేవ్ కి ఇది మొదటి సినిమా కదా, ఎలా చేస్తారో, ఎమోషనల్‌ సీన్స్‌ ను తను ఎలా హ్యాండిల్ చేస్తాడో అనుకున్నాను. కానీ కళ్యాణ్ చాలా బాగా చేశాడు. అని బన్ని అన్నారు.

సంబంధిత సమాచారం :