అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డ్ !

అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డ్ !

Published on Nov 28, 2018 11:35 PM IST

Allu Arjun2

సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే బన్నీ సినిమాలు యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తెచ్చుకొని సరికొత్త రికార్డ్ లు సృష్టించాయి. కాగా తాజాగా బన్నీ నటించిన సాంగ్ కూడా ఓ నూతన రికార్డ్ ని సృష్టించింది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాధం’ చిత్రం పెద్దగా సక్సెస్ కాకపోయినా.. కలెక్షన్ల పరంగా చూసుకుంటే.. ఆ చిత్రం కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించినట్లే.

కాగా ‘దువ్వాడ జగన్నాధం’ చిత్రంలోని ‘సీటీ మార్’ అనే పాట ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ గా మారింది. ఆదిత్య మ్యూజిక్ విడుదల చేసిన ఈ వీడియో సాంగ్ ఏకంగా 90 మిలియన్ వ్యూస్ ను సాధించి రికార్డ్ సృష్టించింది.

ఇక బన్నీ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఓ చిత్రాన్ని చేయబోతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రం డిసెంబర్ లో అధికారికంగా లాంచ్ కానుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు