బన్నీ తో సినిమా కోసం ఎగ్జైటింగ్ గా లేటెస్ట్ తన కల్ట్ ఫ్యాన్ హిట్ డైరెక్టర్.!

Published on Sep 14, 2022 7:03 am IST

మన టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఒక్క మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళ్ సహా మలయాళ ఇతర భాషల్లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే లేటెస్ట్ గా తన కల్ట్ ఫ్యాన్ సహా రీసెంట్ గా వచ్చి హిట్ అయినటువంటి ఒకే ఒక జీవితం దర్శకుడు శ్రీ కార్తీక్ అల్లు అర్జున్ తో వర్క్ పై ఎగ్జైటింగ్ రెస్పాన్స్ ని అందించాడు.

తమ ఇంట్లో తాను తన తల్లిదండ్రులు అంతా కూడా అల్లు అర్జున్ అభిమానులమే అని బన్నీ తో వర్క్ కోసం ఎప్పటివరకు అయినా ఎదురు చూస్తానని తాను తెలిపాడు. సైన్స్ ఫిక్షన్ సినిమాలు అంటే తనకి ఇష్టమని చెప్తున్నా ఈ దర్శకుడు ఒకే ఒక జీవితం తో ఇప్పుడు మెప్పించాడు. మరి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఈ ఫిల్మ్ మేకర్ తో అందులోని తన కల్ట్ ఫ్యాన్ తో బన్నీ వర్క్ ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :