‘పారిస్’లో ఎంజాయ్ చేస్తున్న ‘అల్లు అర్జున్’ !

‘పారిస్’లో ఎంజాయ్ చేస్తున్న ‘అల్లు అర్జున్’ !

Published on Jun 12, 2018 3:24 PM IST

అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘నా పేరు సూర్య’ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ‘నా పేరు సూర్య’ విజయవంతమవుతుందని ఎంతో నమ్మకం పెట్టుకున్న బన్నీని ఈ చిత్రం బాగానే నిరాశ పరిచింది. ప్రస్తుతం బన్నీ ఈ చిత్ర ఫలితాన్ని మర్చిపోయి తన ఫ్యామిలీతో పాటు విశ్రాంతి కోసం ‘పారిస్’కు వెళ్ళారు.

అల్లు అర్జున్ గత సంవత్సరం నుంచి గ్యాప్ లేకుండా ‘నా పేరు సూర్య’ చిత్రం కోసం కష్టపడ్డారు. ఇప్పుడు దొరికిన ఈ ఖాళీ సమయంలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయనున్నారు. అయితే బన్నీ తన తర్వాత సినిమా ఏం చేస్తారు, ఎవరితో చేస్తారు అని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తన తర్వాత చిత్రంతోనైన బన్నీ మళ్ళీ ‘రేసుగుర్రం’ లాంటి భారీ విజయాన్ని అందుకోవాలని, తన అభిమానులను అలరించాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు