అభిమాని కోరికను నెరవేర్చిన స్టైలిష్ స్టార్


బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న తన అభిమాని కోరిక మేరకు రీసెంట్ గా అల్లు అర్జున్ అతని స్వస్థలానికి వెళ్లాడు. అంతే కాకుండా ఆర్దికంగా సహాయాన్ని అందించి రియల్ హీరో అనిపించుకున్నాడు. అసలు వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నంలోని అనాకపల్లి కి చెందిన సాయి గణేశ్‌ అనే యువకుడు గత రెండుళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. అయితే ఇటీవల పరిస్థితి విషమంగా మారడంతో ఆస్పత్రికి తరలించారు.

తన అభిమాన హీరోని చూడాలని ఉందని కోరడంతో సోషల్ మీడియా ద్వారా సమాచారం అందుకున్న బన్నీ వెంటనే అభిమాని వద్ద వాలిపోయాడు. సాయి గణేష్ ను ప్రేమగా పలకరించి కుటుంబ సభ్యులను అడిగి వారి పరిస్థితి గురించి తెలుసుకున్నాడు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబమని తెలిసి తన వంతు సహాయాన్ని అందించాడు. అల్లు అర్జున్ ని కలుసుకున్నందుకు సాయి గణేష్ చాలా ఆనందించాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.

Exit mobile version